No products found
Recent searches
Clear all
Bestsellers
Vidrohi, Kazi Nazrul Islam, Varavararao
Per piece
ఇది ఇద్దరు కవుల సమ్మేళనం. రెండు భాషల కలయిక. బాంగ్లా నజ్రుల్ ఇస్లాం, తెలుగు వరవరరావుల విశిష్ట కవిత్వ, జీవిత సంభాషణ.
జీవితమంతా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మానవహక్కుల పతాకను చేబూని కార్యకర్తగా కవిగా సుప్రసిద్ధుడయ్యాడు నజ్రుల్. ఆయన కవిత్వం నిరంతరం యథాస్థితిని ప్రశ్నించింది. సామాజిక అసమానతనూ అన్యాయాన్నీ ధిక్కరించింది. మూఢ విశ్వాసాన్నీ, వలస పీడననూ సవాల్ చేసింది. ఆయన రచనలు అశేష ప్రజానీకంలో తిరుగుబాటు స్ఫూర్తిని జ్వలింపజేశాయి. ఆయన స్వయంగా వలస వ్యతిరేకోద్యమంలో జైలుపాలయ్యాడు. ఆయన ఉద్వేగం, తీవ్రత, విప్లవ స్ఫూర్తి వెల్లివిరిసే కొత్త కవితా రూపాలను ఆవిష్కరించాడు, భాషతో ప్రయోగాలు చేశాడు. బాంగ్లా సాహిత్య పరిధిని విస్తరించాడు.
తెలుగు కవి, విమర్శకుడు వరవరరావు సాహిత్య అధ్యాపకుడుగా, శక్తిమంతమైన వక్తగా ప్రఖ్యాతి పొందారు. ఆయన కవిత్వం పీడిత సమూహాల పోరాటాలను ప్రతిఫలించే బలమైన సామాజిక, రాజకీయ వ్యాఖ్యానంతో నిండి ఉంటుంది. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాల పునాది నుంచి వికసించిన ఆయన కవిత్వంలో పీడిత వర్గాల దుఃఖాన్నీ ఆగ్రహాన్నీ ప్రతిబింబించే పదునైన ఉద్వేగాలు, సామాజిక వాస్తవికత, రాజకీయ నిబద్ధత వ్యక్తమవుతాయి.
నజ్రుల్ తర్వాత యాబై ఏళ్లకు పుట్టిన వరవరరావు కూడ నజ్రుల్ లాగే స్వేచ్ఛ, సమానత్వం, మానవహక్కుల బలమైన ప్రతినిధిగా నిలిచారు. ఇద్దరూ ఒకే రకమైన కవిత్వం రాశారు. ఇక్కడ వరవరరావు కలం చూపు నుంచి నజ్రుల్ ఇస్లాంను చదవండి.