Home /   Categories /   History  /   Vegu Chukkalu, M.M. Vinodini
  • Vegu Chukkalu, M.M. Vinodini

Vegu Chukkalu, M.M. Vinodini

Per piece

Product details

ఈ గ్రంథం ఆంధ్రుల సామాజిక, సాంస్కృతిక ఉద్యమానికి ఒక ఊతాన్ని ఇస్తుంది. వినోదిని బ్రాహ్మణాధిపత్యం మీద అన్నమయ్యతో కలిసి కొరడా ఝుళిపించింది... సూఫీ ఫకీరులతో పోల్చి హిందూ భక్తి కవులను సమన్వయం చేయడం కొత్తపుంత తొక్కడమే!

- డా. కత్తి పద్మారావు 

డా. వినోదిని అన్నమయ్య సాహిత్యమనే అడవిలోకి పొయ్యిలో కట్టెలకోసం వెళ్తే - ఏకంగా గంధమచెక్కలు, ఎర్రచందనం చెక్కలు గుట్టలుగుట్టలుగా దొరికాయి...

వేమన పద్యాలు ఉటంకించటంలో ఒట్టికట్టె.... పచ్చికట్టె కూడ వంట చెరుకుగా ఉపయోగించుకున్నారనిపించింది. వేమన ఆత్మను ఈయమ్మ చాలా నేర్పుగా పట్టుకోగలగడం విశేషం.

- శశిశ్రీ 

ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు వైతాళికుల్ని స్వీకరించి డా. వినోదినిగారు పరిశీలనలోను, విమర్శలోనూ నిశితంగా దృష్టి సారిస్తూ వంద పుటలకు మించిన వ్యాసం సిద్ధం చేసి సమాజానికి అందిస్తున్నారు. రచయిత భావజాలం, రచయిత రచనల్లో ప్రతిఫలిస్తుందంటూ, అన్నమయ్య చెప్పిన పాటల నుంచి, వేమన పద్యాల నుంచి, బ్రహ్మంగారి శతకాల నుంచి కనిపించే సామాజిక స్పృహను ఈ వ్యాసంలో అద్దంపట్టి చూపారు. 

- కట్టా నరసింహులు

 

Audio Book Available at KUKU FM:
https://kukufm.com/show/vegu-chukkalu

 


Similar products