Home /   Categories /   History  /   Vaikkam Poratam, Pazha Athiyaman
  • Vaikkam Poratam, Pazha Athiyaman
  • Vaikkam Poratam, Pazha Athiyaman

Vaikkam Poratam, Pazha Athiyaman

Per piece

Product details

భారత దేశంలో దళిత విముక్తి కోసం జరిగిన ఉద్యమాలలో వైక్కం  పోరాటం చాలా ముఖ్యమైనది. 
    కేరళ రాష్ట్రంలోని  వైక్కం శివాలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులలో దళిత వర్గాలకు చెందిన ప్రజలు వెళ్లకూడదనే నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 1924లో  శాంతియుతమైన ప్రజా పోరాటం కొనసాగింది. సత్యాగ్రహా కమిటీవారు మూడేసి బృందాలుగా ఆలయ వీధులలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు సత్యాగ్రహ నాయకులందరినీ అరెస్టు చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించే నాయకులు లేని ఆ సమయంలో సత్యాగ్రహ కమిటీ ఆహ్వానాన్ని అందుకొని పెరియార్ ఉద్యమంలో తీవ్రంగా పాల్గొన్నారు. ఈ పోరాటం 141 రోజులు కొనసాగింది. పెరియార్‌ను రెండుసార్లు అరెస్టు చేసి మెత్తం 74 రోజులు జైలులో ఉంచారు. పెరియార్ నిర్విరామ కృషికారణంగా అప్పటి సంస్థాన అధికారులు దళితులను ఆలయవీధుల్లో వెళ్లడానికి అనుమతించారు. పెరియార్ “వైక్కం వీరురు” ప్రస్తుతించబడ్డాడు. ఆటువంటి ప్రాధాన్యతను సంతరించుకొన్న పోరాట చరిత్రను సమగ్రంగా ఆవిష్కరిస్తూ ఉంది ఈ గ్రంథం.


Similar products