No products found
Recent searches
Clear all
Bestsellers
Railu Badi, Tetsuko Kuroyanagi
Per piece
This engaging series of childhood recollections tells about an ideal school in Tokyo during World War II that combined learning with fun, freedom, and love. This unusual school had old railroad cars for classrooms, and it was run by an extraordinary man - its founder and headmaster, Sosaku Kobayashi, who was a firm believer in the freedom of expression and activity.
In real life, the Totto-chan of the book became one of Japan’s most popular television personalities–Tetsuko Kuroyanagi. She attributes her success in life to this wonderful school and its headmaster.
The charm of this account published first in Japanese in 1981, has won the hearts of millions of people of all ages all over the world. Apart from languages outside India, it has been translated into 11 Indian languages.
"[Totto-chan] is a quiet indictment of sterile education." -New York Times
"Sensitively written, delicately illustrated, poetically translated, Totto-chan is, like a haiku, filled with aesthetic and philosophical depth." -Library Journal
"[Totto-chan] has reminded millions of Japanese what children think education should be." -International Herald Tribune
చిన్ననాటి జ్ఞాపకాలను ఆకర్షణీయంగా చిత్రించిన ఈ పుస్తకం విద్యాబోధనతో వినోదాన్నీ, స్వేచ్ఛనూ, ప్రేమనూ కలగలిపిన రెండో ప్రపంచ యుద్ధకాలపు ఆదర్శవంతమైన టోక్యో పాఠశాల గురించి వివరిస్తుంది. ఆ అసాధారణమైన పాఠశాలలో పాత రైలు పెట్టెలే తరగతి గదులు. ఆ రైలు బడిని నడిపిన స్థాపకుడూ, హెడ్ మాస్టరూ సొసాకు కొబయాషి ఒక అపురూపమైన వ్యక్తి. భావ ప్రకటనా స్వేచ్ఛలో, కార్యాచరణలో దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తి.
ఈ పుస్తకంలోని టొటొ చాన్ వాస్తవ జీవితంలో జపాన్ లోకెల్లా అత్యంత జనాదరణ పొందిన టెలివిజన్ వ్యాఖ్యాత టెట్సుకో కురొయనాగి. ఆమె తన జీవితంలో సాధించిన విజయానికంతటికీ మూలాలు ఆ అద్భుతమైన పాఠశాలలో, దాని హెడ్ మాస్టర్ లో ఉన్నాయని అంటారు.
జపనీస్ భాషలో 1981లో మొట్టమొదట వెలువడిన ఈ పుస్తకం ఆకర్షణ ఎంత బలమైనదంటే అది ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై భాషల్లోకి అనువాదమై అన్ని వయసులకూ చెందిన కోట్లాది మంది హృదయాలను చూరగొన్నది. భారతదేశంలోనే ఇది కనీసం పదకొండు భాషల్లోకి అనువాదమయింది.
“నిస్సారమైన విద్యావిధానం మీద నిశ్శబ్దమైన విమర్శ” - న్యూయార్క్ టైమ్స్
“సున్నితమైన రచన, సుకుమారమైన బొమ్మలు, కవితాత్మక అనువాదం టొటొచాన్ ఒక హైకూ లాగా అత్యంత సుందరమైనదీ, తాత్విక నిగూఢతతో కూడినదీ” – లైబ్రరీ జర్నల్
“చదువు ఎలా ఉండాలని పిల్లలు కోరుకుంటారో కోట్లాది మంది జపనీయులకు గుర్తు చేసిన పుస్తకం” – ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్