No products found
Recent searches
Clear all
Bestsellers
Marala Sedyaniki, Sivaram Karanth
Per piece
ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగా వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ
పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం ‘దండగ’నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్ళీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికత.
వకుళాభరణం రామకృష్ణ
వందేళ్ళ కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన యానాన్ని అద్భుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు చాలా ఉంది. కళ్లముందే కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించలేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలాంటిదో ఈ నవల్లో తెల్సుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన నవల.
సుజాత, ఆస్టిన్