Adhunika Bharatadesa Nirmanamlo Dalitulu, Jangam Chinnaiah

200.00

In stock

Pages:224,Price:200/-

Jangam Chinnaiah

Category:

Adhunika Bharatadesha Nirmanam lo Dalithulu is a path breaking work which reconstructs the history of Dalit consciousness in the Andhra region. Jangam Chinnaiah unearths important sources of information about the history and development of the Andhra region under colonial administration. He also proves that the sources which he depends upon for this reconstruction are grossly neglected by mainstream historians in their zeal to project a single version of Modern India’s history. The Telugu book is a translation of his English book, Dalits and the Making of Modern India, OUP, 2017.

 

 

Author description :

Jangam Chinnaiah is a Professor at Carleton University, Canada. The son of a jogini and orphaned early in life, he faced the worst forms of discrimination. Influenced by the massacre of dalits at Karamchedu and Chunduru and the revolutionary politics of the 1990s, and the resurgence of the Ambedkarite thought process, he made them his research themes for his M.Phil and Ph.D. His M.Phil is on Gurram Jashua, a dalit poet. This is an outcome of his Ph.D research from the School of Oriental and African Studies, University of London.

 

Translator :

K Sajaya is a freelance journalist, documentary film maker, translator,  publisher and activist. She co-edited ” Savalakshya Sandehalu : Streela Arogyam, Samskruti and Rajakeeyalu” with K Lalita and ” Stree vada Rajakeeyalu – Varthamana Charchalu” with Prof. Rama Melkote, She also translated Unseen: The Truth about India’s Manual Scavengers as Ashuddha Bharat for HBT.

Telugu

ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు గ్రంధం ఆంధ్ర ప్రాంతంలో దళిత చైతన్య చరిత్రను వెలుగులోకి తెచ్చిన చారిత్రక పరిశోధనాత్మక రచన. వలస పాలన కాలంలో ఆంధ్ర ప్రాంతంలో దళిత చైతన్య చరిత్రకు సంబంధించి అనేక విలువైన ఆధారాలను రచయిత వెలుగులోకి తెచ్చారు. ఏకైక జాతీయతవాద చరిత్ర నిర్మాణం దిశగా సాగిన ప్రధాన స్రవంతి చరిత్రకారులు వాస్తవిక చరిత్ర ను నిర్లక్ష్యం చేసిన తీరును చిన్నయ్య ఈ రచనలో ఎత్తి చూపుతారు. 2017లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం.

జంగం చిన్నయ్య క్లార్టన్ యూనివర్సిటీ, వొట్టావా, కెనడలో చరిత్ర విభాగం లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. జోగిని దేవుడు చిన్నిబాయి కొడుకుగా బాల్యం లో తను ఎదుర్కొనని వివక్ష లేదు. సమాజం తిరస్కృతులుగా తమపై వేసిన ముద్ర తమ పిల్లలకు వేయకూడదన్న పట్టుదలతో చిన్నయ్యను చదివించింది తల్లి. విద్యార్థి దశలో ఉన్నపుడే కారంచేడు, చుండూరు వంటి ఘటనలు చోటుు   చేసుకోవడంతో దళిత ఉనికి గురించి మొదలైన ఆలోచనలు తర్వాతి కాలంలో పరిశోధనాంశాలుగా మారాయి. 1990 నాటి విప్లవోద్యమం, అంబేద్కర్ పోరాటాలు, రాజకీయ పోరాటాలతో ప్రభావితులయ్యారు.  అంచెలంచెలుగా మేధో సోపానంలో ఎదుగుతూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ లో గుర్రం జాషువా పై ఎంఫిల్ థీసిస్ పూర్తి చేశారు. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి దళితుల మేధో, రాజకీయ చరిత్ర మీద డాక్టరేట్ పట్టా పొందారు. ఆ పరిశోధనే ఈ పుస్తకం.

సజయ స్వతంత్ర జర్నలిస్టుగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ గా, అనువాదకురాలిగా, సంపాదకురాలిగా, పబ్లిషర్ గా,  ఉద్యమ నాయకురాలిగా బహుముఖంగా కృషి చేస్తున్న వ్యక్తి. కె. లలిత తో కలిసి చేసిన ‘సవాలక్ష సందేహాలు – స్త్రీల ఆరోగ్యం, సంస్కృతి, రాజకీయాలు’ ; ప్రొఫెసర్ రమా మేల్కొటే తో కలిసి ‘ స్త్రీవాద రాజకీయాలు – వర్తమాన చర్చలు’ సంకలనాలకు సంపాదకత్వం వహించారు. వార్త దిన పత్రికలో స్త్రీల దైనందిన జీవిత రాజకీయాల గురించి రాసిన వ్యాసాలను ‘ప్రవాహం’; నవతెలంగాణ దినపత్రిక లో ‘తొలిపొద్దు’ కాలమ్ పేరుతో రాసిన వ్యవసాయ సంబంధిత వ్యాసాలను ‘ రైతుల ఆత్మహత్యలు-మనం!?’ పేరుతో పుస్తకరూపంలో ప్రచురించారు. హెచ్బీటీ ప్రచురించిన ‘అశుద్ద భారత్’ పుస్తకాన్ని అనువదించారు.
Be the first to review “Adhunika Bharatadesa Nirmanamlo Dalitulu, Jangam Chinnaiah”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Adhunika Bharatadesa Nirmanamlo Dalitulu, Jangam Chinnaiah

200.00

Add to Cart