Home /   Categories /   History  /   Yesu Evaru?, Reza Aslan
  • Yesu Evaru?, Reza Aslan
  • Yesu Evaru?, Reza Aslan

Yesu Evaru?, Reza Aslan

Per piece

Product details

2000 ఏళ్ళ క్రితం ఒక సంచార యూదు బోధకుడు తను నమ్మిన దేవుని రాజ్యాన్ని స్ధాపించడం కోసం గాలలి ప్రాంతంలో తిరుగుతూ, అనుచరులను కూడగట్టే ప్రయత్నం చేసాడు. అతను ప్రారంభించిన విప్లవోద్యమం ఆనాటి పాలక వ్యవస్ధను ఎంతగా భయపెట్టిందంటే అతడిని దేశద్రోహిగా ఉరితీసారు.అతడు మరణించిన కొన్ని దశాబ్దాలలోపే ప్రజలు అతడిని దేవునిగా ఆరాధించేరు. శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్న పురాణగాథలను వడపోసి, ఈ పుస్తకం చరిత్రలోని అత్యంత నిగూఢవ్యక్తులలో ఒకరైన యేసు జీవితాన్ని ఆ నాటి అల్లకల్లోల పరిస్థితుల అద్దంలో చూస్తూ, ఒక క్రొత్త కోణంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తుంది. యేసుని  చారిత్రక వాస్తవాలతో తులనం చేస్తూ రెజా అస్లాన్ యేసుని అవేశపరుడు, దృఢ నిశ్చయం కల వ్యక్తిగానూ అదే సమయంలో ఎన్నో వైరుధ్యాలు కలిగి ఉన్న వ్యక్తిగానూ చూపిస్తాడు. యేసుని రాజకీయాల పట్ల అవగాహన కలిగిన తిరుగుబాటుదారునిగా చూపకుండా, ఒక శాంతి కాముకుడైన ఆధ్యాత్మిక బోధకునిగా చూపటానికి తొలినాళ్ళ క్రిస్టియన్ చర్చి ఎందుకు ప్రయత్నం చేసిందో, ఆ కారణాలను అస్లాన్ విశ్లేషించే ప్రయత్నం చేసాడు. యేసు దైవత్వానికి సంబంధించిన వాదనలన్నింటి మధ్య అసలు యేసు అతడిని తాను ఎలా అర్థం చేసుకున్నాడు  అనే చిక్కుప్రశ్నని విప్పే ప్రయత్నం చేసాడు.
    యేసు జీవితం, అతని ఉద్యమం తాలూకు  విప్లవ తత్వాన్ని, అవి రూపాంతరం చెందిన విధానాన్నీ ధృవీకరిస్తూనే, చరిత్రలోని అతి గొప్ప కథలలో ఒక దాన్ని ఒక సరిక్రొత్తకోణంలో ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది.

 


Similar products