Home /   Categories /   History  /   Shehernama (Telugu)
  • Shehernama (Telugu)
  • Shehernama (Telugu)

Shehernama (Telugu)

Per piece

Product details

PRE-ORDER UNTIL OCTOBER 6TH, 2025.

హైదరాబాద్ నగరానికి రాసిన హృదయపూర్వక లేఖ. చరిత్రను కథనంతో మిళితం చేస్తూ, పరవస్తు లోకేశ్వర్ ఈ నగర బస్తీల ఆవిర్భావాన్ని, స్మారక చిహ్నాల వారసత్వాన్ని, నగరపు వైవిధ్యమైన సామాజిక నిర్మాణాన్ని తీర్చిదిద్దిన ప్రజల జీవితాలను ఆవిష్కరిస్తారు. అనుభవాలు, జ్ఞాపకాలు నిండిన ఈ పుస్తకం హైదరాబాద్‌ యొక్క మమకారం, అందాన్ని పాఠకుల ముందుంచుతుంది.

 

హైదరాబాద్ మహానగరం అనూహ్య వేగంతో అతి భారీగా విస్తరిస్తూ పోతున్నా... స్మృతిపథంలో ‘అసలైన’ ఆ దక్కను వజ్రం పట్ల మమకారం, దాన్ని పొదివి పట్టుకోవాలన్న అందమైన సాహితీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. పరవస్తు లోకేశ్వర్ రాసిన ఈ ‘షహర్ నామా’ ఎంతో మారిపోయిన ఈ నగరపు లోలోపలి కుహరాల్లోకి తీసుకుపోయి, ఆ వీధులలో తిప్పుతూ, ఎంతో ఆత్మీయంగా మనకీ నగరపు ఆత్మను సాక్షాత్కరింపజేస్తుంది.
- సంజయ బారు, రాజకీయ  విశ్లేషకులు, హైదరాబాదీ

 

నేను పెరిగిన హైదరాబాద్ ఎంతో వైవిధ్యంతో, లౌకికతతో అలరారుతుండేది.  ఎన్నో సంస్కృతులూ, సంప్రదాయాలూ, భిన్న రకాల వంటలూ, రుచులూ, బోలెడన్ని భాషలూ, యాసలూ... కలగలిసిన స్వప్నం అది. మాకదంతా ఎంతో సహజంగా అనిపించేది కూడా! కానీ ఆ నగర సంస్కృతీ, ఆ కథలన్నీ కూడా నేటి సమాచార ప్రవాహ ఉద్దృతిలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ పుస్తకంలోని కథలన్నీ కూడా  మేం పెరిగిన ఆ అందమైన హైదరాబాద్ నగర  వైవిధ్యతకూ, సుసంపన్నతకూ అద్దం పడుతున్నాయి. నా మనసును హత్తుకున్న ఈ కథలన్నీ.. నన్ను మరింత హైదరాబాదీగా  మార్చేశాయి! 
- హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత,  విశ్లేషకులు, హైదరాబాదీ

 

Pre-ordered books will be shipped on October 6th, 2025.


Similar products