Home /   Categories /   Fiction  /   Ramzan Bi Dukham, Haneef
  • Ramzan Bi Dukham, Haneef
  • Ramzan Bi Dukham, Haneef

Ramzan Bi Dukham, Haneef

Per piece

Select Pre-order *
Product details

హనీఫ్ కథలు కేవలం కథలు కావు—ముస్లిం సమాజం అనుభవించిన దుఃఖం, పరాయితనం, వివక్ష, పోరాటం, మానవీయ సంబంధాల సామూహిక గాథలు. రజాకార్ల కాలం నుంచి నేటి అనుమానాల, విభజనల కాలం దాకా సాగిన ఈ కథలు, మతానికి అతీతమైన మనుషుల అనుబంధాలను అత్యంత సున్నితంగా చిత్రిస్తాయి. ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో ఇవి గుర్తుండిపోయే ఆణిముత్యాలు.
— వరవరరావు

హనీఫ్ కథలు దగ్ధత్వాన్ని ధిక్కరించిన కథలు. కాలుతున్న ఇళ్ళ నుంచి బయటపడి ప్రాణాలు నిలుపుకున్న మనుషుల కథలు. గత, వర్తమానాల్లో ముస్లిం సమూహాల జీవితాలకు వెలుగు చూపుతూ, వారి వేదనలను, పోరాటాలను, మనుగడను నిజాయితీగా ఆవిష్కరించాయి. ముస్లింలు ఈ కథలు చదివి వేదన చెందుతారు. ఆలోచన చేస్తారు. ముస్లింల పట్ల వ్యతిరేక భావన ఉన్నవారిలో కనీసం నెగిటివిటీని ప్రశ్నించేలా చేస్తాయి. 
— మొహమ్మద్ ఖదీర్ బాబు

హనీఫ్ కథలు ముస్లిం మైనారిటీ ప్రజల జీవితాల్లోని విభిన్న కోణాలను పరిచయం చేస్తాయి—అస్థిరమైన జీవనోపాధులు, భద్రతలేని సామాజిక వాతావరణం, పుట్టిపెరిగిన నేలపైనే ఎదురయ్యే పరాయితనం. ఈ కష్టాల నడుమ ఆశను నిలబెట్టే మతాతీతమైన మానవ సంబంధాలను ముందుకు తెస్తూ, ప్రజాస్వామిక సమాజానికి అడ్డుగా నిలిచే బాహ్య, అంతర్గత ఆధిపత్యాలను ప్రశ్నిస్తాయి. సరళమైన కథనంతో క్లిష్టమైన విషయాలను సున్నితంగా, సానుకూల దృక్కోణంతో చర్చించే కథలివి.
— కాత్యాయని


Similar products