Home /   Categories /   Development Studies  /   Pagatikala, Gijubhai Badheka
  • Pagatikala, Gijubhai Badheka
  • Pagatikala, Gijubhai Badheka

Pagatikala, Gijubhai Badheka

Per piece

Product details

ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించబడుతున్న విషయాలు గానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీ పట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య, ద్వేషం, దెబ్బలాటలు, ఆశాంతి, అసంతృప్తి, అదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్థంగా మారిపోవటం.

ఈ విధానానికి స్వస్తి పలకాలని, ఓ నూతన విధానం కావాలని గిజుభాయి ఎన్నో ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలు పొందారు. ప్రాథమిక విద్యారంగంలో మౌలికమైన మార్పులెన్నో ప్రవేశపెట్టారు. తాను ఆచరించి రుజువు చేశారు. ఆయన స్వయంగా తన పద్ధతుల్లో దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యాకార్యకర్తలను రూపొందించారు. ఓ నూతన మార్గం చూపించారు.

కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసి ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా - ప్రేరణ నిచ్చే వ్యక్తిత్వంతో -

ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే “భావి ఉపాధ్యాయుల నిర్మాణం గిజుభాయి "పగటి కల”.

 

At present, the subjects being taught in primary schools and the methods being used are very harmful to children. Educational merit is being measured through examinations, rewards, competitions, and wrestling bouts. The results of this kind of education are jealousy, hatred, fights, unrest, dissatisfaction, loss of self-control, and situations turning chaotic.

Wishing to bid farewell to this system and seeking a new method, Gijubhai conducted many experiments. He obtained good results. He introduced many fundamental changes in the field of primary education. He practiced and proved them himself. Personally, through his own methods, he trained nearly six hundred teachers and shaped educational workers. He showed a new path.

Not merely teachers who live mechanically within the limited level of job and salary, but with an inspiring personality —

With courage, living for an ideal, the “formation of future teachers” was Gijubhai’s “Pagati kala.”


Similar products