No products found
Recent searches
Clear all
Bestsellers
Nethuti Gaayala Seema Sakshiga, K. Sandhya
Per piece
సంధ్య జ్ఞాపకాలు ఒక మహిళా విప్లవకారిణి జీవితాన్నే కాదు, రాయలసీమలో ప్రజా ఉద్యమాలు, భూస్వామ్య ఫ్యాక్షనిజం, నిర్బంధం, మహిళల పోరాటాల చరిత్రను కూడా నమోదు చేస్తాయి. వ్యక్తిగత బంధాలు, తల్లితనం, త్యాగాలు, ఉద్యమ విజయాపజయాల మధ్య ఆమె ఎదుర్కొన్న సంఘర్షణలు ఈ రచనకు ప్రత్యేకమైన లోతునిస్తాయి. కొత్తతరం తప్పక చదవాల్సిన విలువైన కథ ఇది.
ఉమా చక్రవర్తి
సంధ్య తన రెండు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితాన్ని, ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల అనుభవాలను ఈ పుస్తకంలో సమీక్షించుకున్నారు. ప్రజలతో కలిసి నడిచిన ఉద్యమం ఎలా విస్తరించిందో, ఎలాంటి నిర్బంధాన్ని ఎదుర్కొందో, తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా మార్చిందో ఆమె సూటిగా, ఆత్మపరిశీలనతో చెబుతారు. ఇది ఒక వ్యక్తి జ్ఞాపకాలే కాదు—ప్రజా ఉద్యమాల వెలుగునీడలను అర్థం చేసుకోవడానికి అవసరమైన చారిత్రక సాక్ష్యం.
కాత్యాయని
ఇదొక అరుదైన రచన... ఫ్యాక్షన్ సినిమాలను చూసి అదే రాయలసీమ సంస్కృతి అనుకునే వారికి కనువిప్పు కలిగించే రచన; వేటకొడవళ్ళు పట్టుకు తిరిగే విలన్లు ఉన్న చోట కూడా హీరోలు మగవాళ్ళు మాత్రమే కానక్కర లేదన్న తెలివిడి కలిగించే రచన; సరైన నాయకత్వం ఉన్న చోట ప్రజలు ఎంతటి దుర్మార్గులనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని చెప్పిన రచన; ఒక కాలంలో మార్క్సిస్టు లెనినిస్టు పార్టీల నాయకత్వంలో ఎక్కడికక్కడ జరిగిన అనేక ఉత్తేజకరమైన పోరాటాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోగల రచన. ఆలస్యంగానైనా తన విలువైన అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చి ఆనాడు తమతో కలిసి నడిచిన ప్రజలకు చరిత్రలో ఒక గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన సంధ్యకు అభినందనలు.
వేమన వసంతలక్ష్మి
‘Nethuti Gaayala Seema Sakshiga’ is Sandhya’s deeply personal account of more than two decades of political life and her years of working with people’s movements in Rayalaseema, a region often reduced in popular culture to stories of factional violence.
Moving beyond the familiar imagery of faction films, Sandhya recalls struggles against feudal factionism, land struggles, women’s movements, state repression, and the many ways ordinary people came together to challenge violence and injustice. She also reflects candidly on the personal costs of political life—family, motherhood, relationships, and the difficult choices that accompanied her commitment to the movement.
More than a personal memoir, this is a record of a period when people’s movements emerged across Rayalaseema and when women were not merely participants but also organisers, leaders and protagonists of these struggles. It is a valuable account of the hopes, contradictions, achievements and setbacks of a generation that sought to transform the world around them.