What is History, E.H. Carr, translation Vallompati Venkatasubbaiah
₹120.00
What is History, E.H. Carr, translation Vallompati Venkatasubbaiah
Description
What is History, E.H. Carr, translation Vallompati Venkatasubbaiah, 115 pp, Rs. 120.
This is a milestone book discussing history, facts, the bias of historians, science, morality, individuals and society, and moral judgements in history.
Edward Hallett Carr (1892-1982) was an English diplomat, historian, writer, journalist, and international relations theorist. He is best known for his fourteen-volume history of the Soviet Union and his rejection of traditional historical methods and practices.
Translator Vallompati Venkatasubbaiah (1937-2007) was born and raised in Chittoor district and taught at BT College, Madananapalle. One of the foremost literary critics, he was a Kendra Sahitya Akademy awardee.
Telugu
Telugu
చరిత్ర అంటే ఏమిటి?- ఇ.హెచ్.కార్, 1983, (చరిత్ర) అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, 115 పేజీలు, వెల-120/-
చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అంటే కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా? చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు? ఏ తత్వశాస్త్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా? చరిత్రకూ తత్వశాస్త్రానికీ ఉన్న సంబంధం ఎలాంటిది? పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది? చరిత్రను గురించి ఇటువంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది. మన చారిత్రక చైతన్యాన్ని తట్టి లేపుతుంది. చరిత్రను గురించి ఈ గ్రంథంలోని సిద్ధాంతాలను చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ సాహిత్య చరిత్రకూ అన్వయింప చేయవచ్హు. చరిత్ర విద్యార్ధులకూ ప్రజా కార్యక్షేత్రంలో పనిచేసేవారికీ ఉపయోగపడే ఎంతో విలువైన పుస్తకం.
రచయిత: ఎడ్వర్డ్ హాలెట్ కార్(1892-1982) కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో చదువుకుని బ్రిటిష్ విదేశాంగ శాఖలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి మొదట యేల్స్ విశ్వ విద్యాలంలోను తరువాత ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలోనూ రాజకీయ శాస్త్రంలో ఆచార్యుడుగా పని చేశాడు. కార్ అధునాతన చరిత్రతో పాటు అనేక గ్రంథాలు రాశాడు. అన్నీ సుప్రసిద్ధమైనవే.
అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937-2007) కధా రచయిత, నవలాకారుడు, అనువాదకుడు, విమర్శకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో సహా మరెన్నో అవార్డులను పొందిన గ్రహీత. తెలుగు సాహిత్యం పై ఆయన రచించిన మూడు గ్రంథాలు ఎంతో విలువైనవిగా గుర్తింపు పొందాయి.
Reviews
There are no reviews yet.