Nenu, Phoolan Devini, Marie Therese Cuny, Paul Rambali, translator Navatha

275.00

In stock

Nenu, Phoolan Devini, Marie Therese Cuny, Paul Rambali, translator Navatha

Category:

Nenu, Phoolan Devini, Marie Therese Cuny, Paul Rambali, translator Navatha, 308 pp, Rs. 275
This is the story of Phoolan Devi, (1963-2001) the Bandit Queen who suffered poverty, abuse and kidnap before fighting to claim retribution for herself and all low-caste women in India. She gained massive popular support for her actions and became a symbol of hope for the downtrodden.
Marie-Therese Cuny and Paul Rambali are French writers.

Telugu

నేను పూలన్ దేవిని- పూలందేవి ,మెరీ-థెరస్ క్యునీ, పాల్ రాంబలి, 1999, అనువాదం నవత,   (ఆత్మకథ)  308 పేజీలు, వెల-275/-

నా సాహస కార్యాన్ని కొనియాడు,  నా వీరగాథల్ని గానం చెయ్

నా తప్పిదాల్ని మన్నించు,   నాపై శాంతి వర్షం కురిపించు

పూలందేవి చేసిన ప్రార్ధన ఇది. ఆమె స్వయంగా చెప్పిన తన యాదార్ధ జీవిత గాధే ఈ పుస్తకం. పూలందేవి యావత్ భారతదేశ చరిత్రలోనే ఓ  మహిళా బందిపోటుగా, లివింగ్ లెజెండ్ గా పేరు గాంచింది.

ఒక స్త్రీ బందిపోటుగా ఏ పరిస్తితులలో, ఎలా రూపాంతరం చెందిందో ఆ క్రమాన్ని ఈ పుస్తకం మన కళ్ల ముందు పెడుతుంది. ఇందులో పూలందేవి జీవితంతోపాటు వర్తమాన భారతదేశపు స్థితిగతులు, అందులోని గ్రామాలు ఎలా వున్నాయో, ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయి ఎలా వైఫల్యం చెందుతున్నాయో ఎంతో ఆశక్తికరంగా వివరించే పుస్తకం.  ఈనాటి సమాజంలో కులం, లింగం, వర్గ వివక్షల్ని విడివిడిగా చూసి అర్థం చేసుకోలేక అయోమయంలో పడిపోతున్న మనందరికీ వాటన్నింటి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధం ఏమిటో ఈ పుస్తకం  చాలా స్పష్టంగా మనకు చూపిస్తుంది.

రచయిత: పూలందేవి – మెరీ-థెరస్ క్యునీ, పాల్ రాంబలి సహకారంతో

పూలందేవి (1963-2001) భారతదేశంలో ఒక మహిళా రాబిన్ హుడ్ గా, ఆధునిక బందిపోటు రాణిగా  ప్రసిద్ది గాంచింది. పూలందేవి ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలైయ్యింది. పూలందేవి, ఆమె ఇంటి ముందే దారుణమైన హత్యకు గురయ్యింది.

మేరి థెరెస్ క్యునీ రచయిత, సిని నటి.

పాల్ రాంబలి బ్రిటిష్ రాక్ సంగీతకారుడు,  రచయిత, విశ్లేషకుడు.

అనువాదం:  హైదరాబాదులో జన్మించిన నవత కవి,  అనువాదకురాలు,  గాయకి.  ప్రముఖ తెలుగు పత్రికలో కొంతకాలం పనిచేసింది.సామాజికంగా నిరాదరణకు గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నది. మహిళామార్గం పత్రిక సంపాదకవర్గ సభ్యురాలిగా అనేక వ్యాసాలను రాసింది.

Be the first to review “Nenu, Phoolan Devini, Marie Therese Cuny, Paul Rambali, translator Navatha”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Nenu, Phoolan Devini, Marie Therese Cuny, Paul Rambali, translator Navatha

275.00

Add to Cart