Na maate tupaki toota, Mallu Swarajyam, as told to Katyayini and Vimala
₹120.00
Na maate tupaki toota, Mallu Swarajyam, as told to Katyayini and Vimala
Na maate tupaki toota, Mallu Swarajyam, as told to Katyayini and Vimala, 140 pp, Rs. 120
The memoir of Mallu Swarajyam, doughty Communist firebrand, recounts her childhood in a rich landlord family, joining the Communist movement, working in the armed squad, her later transition to parliamentary work, all the while, remaining alive and responsive to peoples’ issues.
Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
Author Vimala is a renowned poetess, short story writer and essayist.
Telugu
నా మాటే తుపాకి తూటా, 2019, మల్లు స్వరాజ్యం, విమల, కాత్యాయని, (మౌఖిక ఆత్మకథ) పేజీలు-140, వెల-120/-
మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు చరిత్ర. పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని గెరిల్లాగా పాల్గొన్న యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మేల్యేగా 86 ఏళ్ల వయసులోనూ ఉద్యమాలే ఊపిరిగా బతుకుతున్న మల్లు స్వరాజ్యం జీవిత కథనాన్ని హెచ్.బి.టి. మీ ముందుంచుతున్నది.
రచయితలు: మల్లు స్వరాజ్యం, విమల, కాత్యాయని
మల్లు స్వరాజ్యం: కమ్యూనిస్ట్ మార్స్కిస్ట్ పార్టీ నాయకురాలు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న సాయుధ దళసభ్యురాలు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యురాలు. ఇప్పటికీ ప్రజా మహిళా ఉద్యమాలతో సజీవ సంబంధంలో ఉన్నది.
విమల: కవి, విద్యార్ధి, మహిళా ఉద్యమాలలో పనిచేసింది. విమోచన రాజకీయ పత్రిక ఎడిటర్ గా కొంతకాలం ఉంది. కొన్ని కథలను రాసింది. ప్రజా ఉద్యమాలతో క్రియాశీల సంబంధాన్ని కలిగి ఉంది.
కాత్యాయని: రచయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.
Reviews
There are no reviews yet.