Kula nirmulana, 1981, translation of The Annihilation of Caste, B.R.Ambedkar

60.00

In stock

Kula nirmulana, 1981, translation of The Annihilation of Caste, B.R.Ambedkar

Category:

Description

Kula nirmulana, 1981, translation of The Annihilation of Caste, B.R.Ambedkar, translated Boyi Bheemanna, 103 pages, Rs. 60/- . This is the classic analysis of the caste system. “What the Communist Manifesto is to the capitalist world, Annihilation of Caste is to India,” says Anand Teltumbde. In the essay, Ambedkar criticises the Hindu religion, its caste system and its religious texts which are male dominant, spread hatred and suppress the interests of women. He argues that the real method of breaking up the caste System is… to destroy the religious notions upon which caste is founded.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.

Translator: Boyi Bheemanna (1911-2005) was a poet, his writings reflecting the angst of the down-trodden. He also wrote in English

Telugu

Telugu

కుల నిర్మూలన,   1981,  డా.బిఆర్.అంబేడ్కర్,   అనువాదం:  బోయి భీమన్న,  (కులం)  పేజీలు-103,   వెల:60/-

కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ.  ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది.  ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతి పాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని మహాఙ్ఞానులని అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మాహా  పాపమని, ప్రజలకు  ఒక నమ్మకం ఉంది.  అందువల్ల – కులవ్యవస్థను వదులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాధమిక మత భావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే.హిందువులు  తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు.   కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు.  అందువల్ల మీరు కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది.  అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉన్నదన్నమాట.

అంబేడ్కర్ రాసిన Annihilation of caste కి  తెలుగు అనువాదం. కుల సమస్యపై కీలక పత్రంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ గుర్తించి లక్షలాది కాపీలు అమ్ముడు పోయిన పుస్తకం.

రచయిత: బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు అంబేడ్కర్,(1891-1956)  న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధబోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం: బోయి భీమన్న ప్రభుత్వ అనువాదశాఖలో డైరెక్టర్ గా  పనిచేశాడు. కవి. సమాజంలో అట్టడుగువారు ఎదుర్కుంటున్న సమస్యలు వారి  స్థితిగతులు,  ఆయన రచనలలో ప్రతిబింబించేవి. ఆంగ్లంలో కూడా రచించేవాడు.

Reviews (0)

Be the first to review “Kula nirmulana, 1981, translation of The Annihilation of Caste, B.R.Ambedkar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.