Jeena Hai To Marna Seekho, Katyayini
₹100.00
జీనా హైతో మర్నా సీఖో, 2016, తెలుగు రచన : కాత్యాయని (జీవిత చరిత్ర)115 పేజీలు, వెల- /100/-
కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
కాత్యాయని రచయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.
Reviews
There are no reviews yet.