India lo daagina Hindustan, The Indian Ideology, Perry Anderson

130.00150.00 (-13%)

In stock

India lo daagina Hindustan, The Indian Ideology, Perry Anderson

Category:

India lo daagina Hindustan, The Indian Ideology, Perry Anderson, translator Prabhakar Mandara, 165 pp, Rs. 150
This powerful book suggests that the roots of India’s current ills go very deep, historically. They lie in the way the struggle for independence culminated in the transfer of power from British rule to Congress in a divided subcontinent, not least in the roles played by Gandhi, as the great architect of the movement, and Nehru, as his appointed successor, in the catastrophe of partition. Revisiting a century’s history, and sifting the uncomfortable realities from the ideology, Anderson offers an alternative way to look at the story of the nation, and the nature of a state that is less in conflict with caste than built upon it.
Perry Anderson teaches history at UCLA and is on the editorial board of the New Left Review. He has authored several books.
Mandara Prabhakar who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

ఇండియాలో దాగిన హిందుస్థాన్-పెరి ఆండర్సన్, 2014, అనువాదం ప్రభాకర్ మందార, (చరిత్ర) 165 పేజీలు, వెల-150/-

“ఇండియాలో హిందుస్థాన్ అనే అర్థం దాగివుంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్హకూ, అణచివేతకూ మధ్యనున్న సరిహద్దులనీ, దేన్నీ అనుమతించాలి దేన్ని నిషేధించాలి వంటి అంశాలనన్నింటినీ చాప కింద నీరులాగా ఇండియాలో దాగివున్న ఈ హిందూ అంశే నిర్ధేశిస్తోంది”

“స్వాతంత్రం కోసం సాగిన పోరాటంలో చీలిక మతపరంగా వచ్హినదే అయినా అసలు మతపర పదజాలాన్నీ, భావజాలాన్నీ జాతీయోద్యమంలో ప్రవేశపెట్టినవాడు జిన్నా కాదు గాంధీ”

భారత గణతంత్రమే ఘనమని అందర్నీ నమ్మిస్తుండే మేధావులను ఇబ్బంది పెట్టే ఇటువంటి ప్రతిపాదనలు ఇందులో చాలానే ఉన్నాయి. దేశ విభజనలో గాంధీ, నెహ్రూ ల పాత్రను పెరిఆండర్ సన్ విశ్లేషించాడు.

రచయిత: పెరి ఆండర్సన్, ఆంగ్లో ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు  మేధావి, చరిత్రకారుడు. 1962 నుంచి న్యూ లెఫ్ట్ రివ్యూ సంపాదకుడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాసేంజిల్స్ లో చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు

అనువాదం:   ప్రభాకర్ మందార, అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి  అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Average Rating

5.00

01
( 1 Review )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

1 Review For This Product

  1. 01

    by Rama Sundari

    అట్ట మీద అరుంధతీ రాయ్ రాసిన నాలుగు వాక్యాలే ఈ పుస్తకం గురించి చాలా విషయాలు చెబుతాయి. ఈ పుస్తక రచయిత పెరి అండర్ సన్, ఇలాంటి పుస్తకాలు రాస్తున్నాడని భారత మేధావులు ఇతని మీద ధ్వజం ఎత్తారు.
    ఈ రోజుకి నాలుగు లక్షలకు మించి భారత సైన్యం కశ్మీర్ లో వున్నారు. ఇది పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైన్యం కంటే ఎక్కువ. బ్రిటీష్ రాజ్యాలకు మేమే వారసులమని ప్రకటించుకొని ఆక్రమించుకొన్న ఈశాన్య రాష్ట్రాలలో నలభై ఏళ్ళు గడిచినా ఇంకా ‘సాయుధ దళాల పత్యేక చట్టం’ ‘అవసరం’ అవుతూనే ఉంది. భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని పొందటానికి ముస్లిం ప్రజలు చెల్లించిన మూల్యం ఎంత?
    పెద్ద భూభాగానికి ప్రధాని కావటానికి నెహ్రూ చేసిన మొండి రాజకీయం ఎన్ని కోట్ల ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాల రాసింది? జాతీయోద్యమంలోనే హిందూ మతాన్నిజోడించి గాంధీ చేసిన కసరత్తు దేశ విభజనకు దారి తీయలేదా? అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి నిజాయితీ కలిగిన నాయకుల అణచివేత వెనుక జరిగిన కుట్రలు ఎన్ని?
    ప్రతి వాక్యానికి రిఫరెన్స్ యిస్తూ రాసిన పుస్తకం ‘ఇండియాలో దాగిన హిందుస్తాన్’. తప్పక చదవమని నేను రికమెండ్ చేస్తాను. రచయిత పెరి అండర్ సన్. అనువాదం ప్రభాకర్ మందార. HBT ప్రచురణ. 2014,2017లలో ముద్రణ పొందింది.

    A Review by Rama Sundari

Main Menu

India lo daagina Hindustan, The Indian Ideology, Perry Anderson

130.00150.00 (-13%)

Add to Cart